పని చేయకుంటే డ్యూటీ మానేయ్యండి


Wed,November 20, 2019 12:45 AM

-అందరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలి
రాయికోడ్: వర్డల్ టాయ్‌లెట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల పరిధిలోని సంగాపూర్‌లో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ప్రభాకార్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను వాడాలన్నారు. ప్రభుత్వం 100శాతం రాయితీపై ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా మరుగుదొడ్లను మంజూరుచేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వట్‌పల్లిలో..
వట్‌పల్లి: ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని వినియోగించుకుని పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని డీఆర్‌డీవో పీడీ శ్రీనివాస్‌రావు సూచించారు. వర్డల్ టాయ్‌లెట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం వట్‌పల్లిలో పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

మరుగుదొడ్ల నిర్వహణపై అవగాహన ర్యాలీ
హత్నూర: వర్డల్ టాయ్‌లెట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మరుగుదొడ్ల వాడకంతో చేకూరే ప్రయోజనాలు తెలియజేశారు. చీక్‌మద్దూర్, నాగుల్‌దేవులపల్లి, రెడ్డిఖానాపూర్ తదితర గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...