అదనపు రైలు నడిపించాలి


Wed,November 20, 2019 12:45 AM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : బీదర్ నుంచి ముంబయికి నడిపిస్తున్న రైలును జహీరాబాద్ వరకు పొడించాలని స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానంద్ మాల్యాను కోరారు. మంగళవారం సాయంత్రం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానంద్ మాల్యా జహీరాబాద్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. జహీరాబాద్ స్టేషన్‌లో నిర్మాణం చేస్తున్న రెండో ప్లాట్ ఫాం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, షాపింగ్ మాల్, పార్కుల నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం ఆయన మొక్కలు నాటా రు. ఆదర్శ స్టేషన్‌గా ఖ్యాతి గాంచిన జహీరాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. అలాగే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం మరిన్ని మూత్రశాలలు, మరుగుదొడ్లతోపాటు విశ్రాంతి గదులను నిర్మించాలని రైల్వే జీఎం దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద లిప్టు నిర్మించడం వల్ల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. జహీరాబాద్, కోహీ ర్ స్టేషన్ ప్రయాణికులు వాహనాలు నిలిపేందుకు షెడ్లను నిర్మించాలని, అలాగే జహీరాబాద్ నుంచి వెళ్లే రైలును కోహీర్ స్టేషన్‌లో నిలిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

రైల్వే లైన్లు నిర్మాణం చేయాలి..
సికిందరాబాద్ నుంచి జాతీయ రహదారి వెంట పటాన్‌చెరు, సంగారెడ్డి-జహీరాబాద్ వరకు కొత్తగా రైల్వే లైన్ నిర్మాణం చేసేందుకు కృషి చేయాలని ఎంపీ బీబీ పాటిల్ తరపున రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీదు రైల్వే జీఎంకు వినతి పత్రం ఇచ్చారు. అలాగే జహీరాబాద్, కోహీర్ రైల్వే స్టేషన్లకు కొత్త భవనాలతో పాటు సిబ్బంది కోసం కొత్తగా క్వార్టర్స్ నిర్మించాలని వినతి పత్రంలో ప్రస్తావించారు. దీంతోపాటు బీదర్ ఇంటర్ సిటి రైలు సమయంలో మార్పులు చేయాలన్నారు. వికారాబాద్, మార్పల్లి, జహీరాబాద్, బీదర్, పార్లి వైథ్యనాథ్ వరకు ప్యాసింజర్ రైలు నడిపించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్ తదితరులు ఉన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...