మల్లన్న నామస్మరణలతో మార్మోగుతున్న కొమురవెల్లి


Wed,November 20, 2019 12:44 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో 18వ తేదీన ప్రారంభమైన రాజగోపుర మహా కుంభాభిషేక పూజలు మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. స్వామి వారి మహాకుంభాభిషేకం సందర్భంగా ఆగమ పండితుల మంత్రోచ్ఛరణలతో మల్లన్న పుణ్యక్షేత్రం మార్మోగుతున్నది. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయ పూర్వాచార ప్రకారం వీరశైవ సంప్రదాయనుసారం వీరశైవ జగద్గురువు పీఠాధిపతి ఉజ్జయని సద్ధర్మ సింహాసనాధీశ్వర సిద్ధలింగం రాజదేశి కేంద్ర శివాచార్య మహాస్వామి సూచనల మేరకు కుంభాభిషేకం పూజలు నిర్వహిస్తున్నారు. పుష్కరకాలం అనంతరం నిర్వహిస్తున్న కుంభాభిషేక పూజలను 108 మంది ఆగమ పండితులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. స్వామి వారి క్షేత్రంలోని గంగరేగు చెట్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో వీరశైవ ఆగమ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి వారి గర్భాలయంలో మల్లన్నకు అభిషేకం, నిత్య పూజలు నిర్వహించారు.

రెండోరోజు ప్రత్యేక పూజలు
మహాకుంభాభిషేకం పూజల్లో రెండో రోజు సుప్రభాత సేవ, శ్రీ స్వామి వారి నిత్యార్చణలు, నిత్య మంటపారధనలు, మహా రాజగోపురం సంప్రోక్షణ, మహాగణపతి హోమం, వేద, ఆగమ, ఇతిహాస, పురాణజప, పారాయణములు, రుద్రహోమం, మహామంగళ హారతి, మంత్రపుష్పం అనంతరం తీర్థప్రసాద వితరణ పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేశ్, ఏఈవో రావుల సుదర్శన్, పర్యవేక్షకుడు నీల శేఖర్, ఏఈలు బ్రహ్మండ్లపల్లి అంజయ్య, ప్రతాప్, సిబ్బంది బత్తిని పోచయ్య, వైరాగ్యం జగదీశ్వర్, మేకల పోచయ్య, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, వెంకటచారి, మాధవి, సార్ల విజయ్‌కుమార్, సార్ల కనకయ్య, నర్సింహులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...