చదువుకుంటే మంచి భవిష్యత్‌


Mon,November 18, 2019 11:29 PM

సంగారెడ్డి టౌన్‌ : చదువుకుంటే మంచి భవిష్యత్‌ ఉంటుందని అసిస్టెంట్‌ కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ విద్యార్థులకు సూచించారు. సోమవారం సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆధ్యాత్మిక, దేశభక్తి, జానపద అంశాలపై పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ విజ్ఞాన గ్రంథాలయాల్లో పుస్తక పఠనంతో పాటు విద్యార్థులు తమ ప్రతిభను అన్ని రంగాల్లో చాటాలన్నారు. అదే విధంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు కొత్త ఆవిష్కరణలను, పరిశోధనలను గుర్తించేలా విద్యాభ్యాసం కొనసాగించాలన్నారు.

విద్యను నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఏ రంగంలో అయిన రాణించవచ్చన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి మాట్లాడుతూ బాలలందరూ కచ్చితంగా గ్రంథాలయాలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వసుంధర, యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు కూన వేణుగోపాల కృష్ణ, గ్రంథాలయ సంస్థ సిబ్బంది కిషన్‌, వెంకటరమణ, ఆర్‌.శ్రీనివాస్‌, ప్రశాంత్‌కుమార్‌, సురేశ్‌ కుమార్‌, శోభారాణి, సావిత్రి, కృష్ణమూర్తి, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు ఆధునిక సమాజం-మానవత విలువలు చర్చా వేదిక..
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం ఉదయం 11.00 గంటలకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నేడు ఆధునిక సమాజం- మానవత విలువలు అనే అంశంపై చర్చా వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చర్చా వేదికలో పాల్గొని అమూల్యమైన అభిప్రాయాలు పంచుకోవాలన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...