వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి


Mon,November 18, 2019 11:29 PM

సంగారెడ్డి చౌరస్తా: వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్‌పీఆర్డీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వికలాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మాట్లాడుతూ 21రకాల వైకల్యాలను గుర్తించారని, దీని ప్రకారం 25లక్షల మంది వికలాంగులు ఉన్నారని, చట్టం వచ్చి 3 ఏండ్లు అయిందని పేర్కొన్నారు. అయితే 21 వైకల్యాలకు సదరం సర్టిఫికెట్లు ఇప్పటికీ ఇవ్వడం లేదని, వెంటనే ఇప్పించాలని కోరారు. వికలాంగులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలని, అందరికీ అంత్యోదయ కార్డులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణికి వారు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు నర్సింహులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లేశం, ప్రెసిండెంట్‌ గోపాల్‌, టీఎండీఏ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్‌, ఎన్‌పీఆర్డీ జిల్లా నాయకులు కృష్ణ, రాజు, ప్రకాశ్‌, నర్సింగ్‌రావుమ గఫ్ఫార్‌, రమాదేవి, సత్యనారాయణ, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...