సంగారెడ్డి చౌరస్తా: పటాన్చెరులో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పట్టణ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. స్థానిక విద్యానగర్‌లోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాల, గణేశ్‌నగర్‌లోని సెయింట్ పీటర్స్ విద్యార్థులు వినూత్నంగా ప్రదర్శనలు చేపట్టి అందరి అభినందనలు పొందారు. ఆంథోనీస్ పాఠశాల విద్యార్థి మధువాణి సస్టేనబుల్ అగ్రికల్చర్ అనే అంశంపై నమూన ప్రదర్శించి జిల్లా స్థాయి మొదటి బహుమతి సాధించగా, అదే పాఠశాలకు చెందిన నిఖిత హెల్త్ ఆండ్ క్లీన్లీనెస్ అనే అంశంపై ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నది. సెయింట్ పీటర్స్ విద్యార్థి కార్తికేయకు ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్‌లో జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి వచ్చింది. జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ ఆంథోనీరెడ్డి అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.