అడవుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత


Mon,November 18, 2019 11:29 PM

గుమ్మడిదల : అడవులను రక్షించుకోవడం వల్ల అర్బన్‌ పార్కుల తయారవుతాయని జిల్లా అటవీశాఖ రేంజ్‌ అధికారి శ్యామ్‌కుమార్‌ అన్నారు. సోమవారం మండలంలోని బొంతపల్లి అటవీ ప్రాంతాన్ని జిల్లా అటవీశాఖ రేంజ్‌ అధికారి శ్యామ్‌కుమార్‌తో పాటు డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి రవికుమార్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుమ్మడిదల అటవీ సెక్షన్‌ అధికారి మజ్దిత్‌సింగ్‌, బీట్‌రూట్‌ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా రేంజ్‌ అధికారి శ్యామ్‌ మాట్లాడుతూ అడవులను రక్షించుకోవడానికి చర్య లు తీసుకుంటున్నామన్నారు. అందులో ఉండే వన్యప్రాణుల రక్షణ కోసం గుమ్మడిదల, నల్లవల్లి, మంభాపూర్‌, బొంతపల్లి అటవీ ప్రాంతంలో 8 చెక్‌డ్యామ్‌లను ఏర్పాటు చేయడానికి స్థలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. వచ్చే వేసవిలో వన్యప్రాణులకు తాగు నీటి కొరత లేకుండా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు.

వెంటనే చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను చేపట్టనున్నామని తెలిపా రు. బొంతపల్లి అటవీ ప్రాంతాన్ని రక్షించడానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో అడవి చుట్టు కంచె నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. దీని వల్ల అడవిలో వన్య ప్రాణులకు కూడా రక్షణ కలుగుతుందన్నారు. వన్యప్రాణులు రోడ్డుపై వచ్చి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండదన్నారు. ఈ కంచెల నిర్మాణం వల్ల ఇక్కడి ప్రాంతం పచ్చని వాతావరణంతో కళకళలాడుతుందన్నారు. దీని వల్ల అర్బన్‌ పార్క్‌ రూపకల్పనతో అడవులు హరిత వనాలుగా మారుతాయని తెలిపారు. వీరితో పాటు అటవీశాఖ అధికారులు ఉన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...