శాస్త్రవేత్తలు దేశానికి అవసరం


Sun,November 17, 2019 11:07 PM

-బాల శాస్త్రవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం
-ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తాం
-సైన్స్, టెక్నాలజీలకు ప్రాధాన్యత
-వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులకు స్ఫూర్తిదాయం
-జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
-ముగిసిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్
-బహుమతులు ప్రదానం చేసిన ఎంపీ, డీఈవో
-అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : శాస్త్రవేత్తలు దేశానికి ఎంతో అవసరమని ఎంపీ బీబీ పాటిల్ అన్నా రు. పటాన్‌చెరు పట్టణంలోని సెయింట్ జోసఫ్ హైస్కూల్‌లో జిల్లాస్థాయి జవహర్‌లాల్ నెహ్రూ సైన్స్, గణిత, పర్యావరణ ఎగ్జిబిషన్ 2019-20 ముంగిపు కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, డీఈవో విజయలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శనలో విజేతలుగా నిలిచిన బాల శాస్త్రవేత్తలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ... నేడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నేటి బాల శాస్త్రవేత్తలే రేపటి శాస్త్రవేత్తలుగా తయారు కావాలని సూచించారు. నేర్చుకోవాలనే తపన, కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, పరిశోధించే శక్తి ఉన్నవారు పరిశోధనా రంగంలో తమ ప్రతిభను చాటాలన్నారు. ప్రజా అవసరాలు, దేశ అవసరాలు, సమాజ హితం కోసం పరిశోధనలు చేస్తే ఎన్నో ఆవిష్కరణలు వస్తాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నదన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలు, శాస్త్రసంబంధిత పరిశోధనలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. విద్యార్థులు పాఠాలతో పాటు వాటిలో ఉన్న శాస్త్రీయమైన విషయాలపై ఆసక్తి పెం పొందిచుకోవాలని సూచించారు. విద్యాధికారులు చిన్నారులను అన్ని విషయాల్లో ప్రోత్సహించాలన్నారు. టెక్నాలజీ, సైన్స్‌కు మంచి రోజులు ఎప్పటికీ ఉంటాయన్నారు. రెడ్‌బస్ యాప్ విజయవంతం కావడానికి టెక్నాలాజీ కారణమ న్నారు. కొత్త ఐడీయా మన జీవితాన్నే మార్చేస్తుంది అనేది సత్యమని చెప్పారు. వైజ్ఞానిక ప్రదర్శనలో చాలా మంచి మోడల్స్ వచ్చాయి. విద్యార్థుల్లో మంచి ప్రతిభ కనిపిస్తున్నది. ఉపాధ్యాయులు పరిశోధనా రంగంలో చురుగ్గా ఉన్న విద్యార్థులను గుర్తించి సలహాలు, సూచనలు చేయాలన్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్‌లను మరిన్ని పెట్టాలని కోరారు. విద్యాసంబంధిత విషయాల్లో తాను అండగా నిలుస్తానని ఎంపీ హామీనిచ్చారు. గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు మరింత రాణించాలన్నారు.

విజేతలు వీరే..
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 518 ప్రదర్శనలు విద్యార్థులు పెట్టారు. వాటిలోంచి న్యాయనిర్ణేతలు యూపీఎస్‌ల్లో 6 ఉత్తమమైన ప్రదర్శనలను, జడ్పీహెచ్‌ఎస్‌లో 6 ఉత్తమమైన ప్రదర్శనలను ఎంపిక చేశారు.
ఉన్నత పాఠశాలల్లో
మొదటి స్థానాలు
సీహెచ్ విష్ణు, జడ్పీహెచ్‌ఎస్, పెద్దాపూర్,
సదాశివపేట మండలం.
కుసుమ్ చౌదరీ, మంజీర హైస్కూల్, పటాన్‌చెరు
కె.శ్వేత, కేజీబీవీ, జిన్నారం.
ఏరాజ్‌కుమార్, సెయింట్ మేరీ గ్రామర్
హైస్కూల్,
ఇస్నాపూర్ మండలం.
రేవతి, జడ్పీహెచ్‌ఎస్, భానూర్,
పటాన్‌చెరు మండలం.
సీహెచ్ ప్రభు, జడ్పీహెచ్‌ఎస్, పుల్కల్.
ఉన్నత పాఠశాలల్లో రెండో స్థానం..
సీహెచ్ శ్రీలత, జడ్పీహెచ్‌ఎస్, తడ్కల్,
కంగ్టి మండలం.
సీహెచ్ నిఖిత, సెయింట్ ఆంథోని హై స్కూల్,
సంగారెడ్డి
కె.గురుజ్యోతి, జడ్పీహెచ్‌ఎస్, అందోల్.
సీహెచ్ నాగరాజు, జడ్పీహెచ్‌ఎస్, గుమ్మడిదల.
ఎండీ జాఫర్, టీఎంఆర్‌ఎస్, పటాన్‌చెరు.
బి.కార్తీక్, శారద హై స్కూల్, ముత్తంగి,
పటాన్‌చెరు.
యూపీఎస్ పాఠశాల స్థాయిలో మొదటి స్థానాలు..
డి.మధువని, సెయింట్ ఆంథోని హైస్కూల్,
సంగారెడ్డి.
గాయత్రి, సెయింట్ జోసఫ్ హైస్కూల్,
పటాన్‌చెరు.
కె.దుర్గాప్రసాద్, త్రివేణి హై స్కూల్, అశోక్‌నగర్,
ఆర్సీపురం.
గోవర్ధని, జీసస్ మెరీ హై స్కూల్, పటాన్‌చెరు.
ఎండీ. వాకిద్, సెయింట్ మేరీ హైస్కూల్,
జిన్నారం.
ఏ కార్తీక్, యూపీఎస్, మాసన్‌పల్లి, అందోల్.
యూపీఎస్ పాఠశాల స్థాయిలో రెండో స్థానాలు..
ఎం.వైష్ణవి, యూపీఎస్, ఇప్పెపల్లి, మొగుడంపల్లి.
కె.నిఖిత, విశ్వభారతి హై స్కూల్, ఆర్సీపురం
రిషి, జడ్పీహెచ్‌ఎస్, కంది
యశ్వంత్, సెయింట్ జోసఫ్ హైస్కూల్
పటాన్‌చెరు.
ఏ.కార్తికేయ, సెయింట్ పీటర్ స్కూల్, సంగారెడ్డి.
పి.పల్లవి, యూపీఎస్, వందంకొమ్ము,
అమీన్‌పూర్.
ఉపాధ్యాయులు టీఎల్‌ఎం..
ప్రథమ స్థానం : బి.ప్రభాకర్‌రావు, జడ్పీహెచ్‌ఎస్,
భానూర్, పటాన్‌చెరు మండలం
ద్వితీయ స్థానం: సిద్ధారెడ్డి, జడ్పీహెచ్‌ఎస్,
కార్పొల్, పుల్కల్ మండలం.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...