యువ శ్రమదానంతో గ్రామం పరిశుభ్రత


Sun,November 17, 2019 11:06 PM

ఝరాసంగం: మండలంలోని మేదపల్లి గ్రామంలో ఆదివారం 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనుల్లో భాగంగా సర్పంచ్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో యువ శ్రమదానం నిర్వహించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీతోపాటు గ్రామ పంచాయతీ ఆవరణలో పిచ్చిమొక్కలు తొలిగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం తమ గ్రామంలో యువ శ్రదానం నిర్వహిస్తున్నామన్నారు. హరితహారం మొక్కల సంరక్షణ, వేకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం పనులు చేసి స్వచ్ఛత గ్రామాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు బోజప్ప, మాణిక్యప్ప, ఝరాసంగం జడ్పీ పాఠశాల చైర్మన్ వెంకటేశం యువజన సంఘాల నాయకులు శ్రీను, ధన్‌రాజ్, శేఖర్, చెంద్రప్ప పాల్గొన్నారు.

గ్రామాల్లో యువ శ్రామదానం
మునిపల్లి: ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో యువ శ్రమదానం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఆదివారం మండలంలోని ఆయా గ్రామాల్లో సంబంధిత పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోని యువజన సంఘాల సభ్యులతో శ్రదానం చేయించారు. గ్రామ అభివృద్ధికి యువత ముందుండాలని పంచాయతీ కార్యదర్శులు యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల యువజన సంఘల సభ్యులు పాల్గొన్నారు.
చీక్‌మద్దూర్‌లో శ్రమదానం
హత్నూర: మండలంలోని చీక్‌మద్దూర్‌లో ఆదివారం గ్రామ యువకులు శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, చెత్తను తొలిగించారు. కాగా, చీక్‌మద్దూర్‌లో 30రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో చేపట్టిన పనులు నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు యువకులు తెలిపారు. గ్రామం ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించి ఆదర్శ గ్రామంగా నిలువగా మరింత అభివృద్ధిచేసి రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు శ్రీశైలం, సునీల్‌రెడ్డి, నవీన్, ప్రవీణ్, గోపాల్, లక్ష్మణ్, నర్సింహులు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...