పొలాల్లో పంట నూర్పిళ్లు


Sun,November 17, 2019 11:05 PM

కోహీర్: మండలంలోని ఆయా గ్రామాల్లో పంటల రాశులు జోరుగా సాగుతున్నాయి. రైతులు తమ వ్యవసాయ పొలాల్లో సాగు చేసిన పంటలను రాశులు చేయడంలో వారు నిమగ్నమయ్యారు. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, తదితర పంటల ధాన్యపు రాశులను హుషారుగా నిర్వహిస్తున్నారు. తమ పొలాల వద్ద యంత్రాల్లో కంకులను వేసి ధాన్యం సేకరిస్తున్నారు. యంత్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి మార్కెట్‌కు తరలిస్తున్నారు. రైతులు, కూలీలు కలిసి పంట నూర్పిళ్లు చేస్తున్నారు. మొక్కజొన్న, సోయాబీన్ పంటల సాగుకు వాతావరణం కూడా అనుకూలించడంతో దిగుబడులు కూడా అధికంగానే వస్తున్నాయి. నిరంతరంగా వర్షాలు పడడంతో పత్తి పంటకు మాత్రం తెగుళ్లు సోకి పత్రాలన్నీ రాలిపోయాయి. దీంతో పత్తి దిగుబడి తగ్గుతున్నది. పంటల ధాన్యం సేకరణలో రైతులందరూ బిజీబిజీగా ఉన్నారు. ధాన్యాన్ని మార్కెట్‌కు తరలిస్తున్నారు. మద్దతు ధర కూడా అనుకూలంగా ఉండడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము పండించిన పంటలకు మద్దతు ధర ఉండడంతో తమ కుటుంబాలను సంతోషంగా పోషించుకునే అవకాశం ఉన్నది. రైతులు, కూలీలతో వ్యవసాయ పొలాలు కళకళలాడుతున్నాయి.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...