పోరాటపటిమతోనే విజయాలు


Sat,November 16, 2019 11:12 PM

-పోరాటపటిమ కలిగినవారికే విజయాలు
-చదువుతోపాటు క్రీడల్లోనూ ముందుండాలి
-జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి
-ముగిసిన స్వేరో ఒలంపిక్స్
-విజేతలకు బహుమతుల ప్రదానం
పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : పోరాటపటిమ కలిగినవారికే విజయాలు వరిస్తాయని జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం పటాన్‌చెరు మం డలం చిట్కుల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ఆవరణలో నాలుగు రోజులుగా జరుగుతున్న స్వేరో ఒలంపిక్స్- 2019 ముగింపు కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అన్ని క్రీడాంశాల్లో విజేతలైన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా మం జుశ్రీ మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ గురుకులాలు ఇప్పు డు ప్రతిభకు నిలయాలుగా మారాయని కొనియాడారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరుస్తున్నవారికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు. క్రీడాకారులు గెలుపోటములు సమానంగా తీసుకోవాలన్నారు. క్రీడాస్ఫూర్తితో ముందుకు పోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వంలో క్రీడలకు ప్రోత్సాహం అందజేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ క్రీడలకు అధిక నిధులను ఇచ్చి క్రీడాకారులకు వెలుగులోకి తీసుకుని వస్తున్నారన్నారు.

నాణ్యమైన సన్నబియ్యం భోజనం గురుకుల హాస్టళ్లలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మాంసాహారంతో పాటు కోడిగుడ్లను కూడా విద్యార్థులకు అందజేయడంతో పోషకాలతో కూడిన భోజనం వారికి లభిస్తున్నదన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అన్నిరకాల ప్రావీణ్యాలను సాధిస్తున్నారన్నారు. చదువులోనూ మంచి ర్యాంకులు సాధిస్తున్నారని కొనియాడారు. క్రీడల్లోనూ జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని చెప్పారు. గురుకులాల్లో వసతుల కల్పనకు కృషిచేస్తానని హామీనిచ్చారు. బాలికలు ఏ రకంగా చూసిన బాలురకు తీసిపోరన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ వంటి పోగ్రాంలో పాల్గొనాలని సూచించారు. గురుకుల ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు.

వారి కృషి కారణంగా ఇప్పుడు విద్యార్థులు మంచి ప్రతిభను కనబర్చుతున్నారన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ గార్గ్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. మంచి మౌలిక వసతులతోపాటు చక్కటి విద్యావిధానాలు అమలు అవుతున్నాయన్నారు. గురుకులాల్లో జరుగుతున్న క్రీడలతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగు చూస్తారన్నారు. అమ్మాయిల్లోనూ ప్రతిభ ఉంటుందని, వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. విద్యాప్రమాణాలు కూడా గురుకులాల్లో పెరిగాయన్నారు. రాబోవు రోజుల్లో గురుకుల విద్యార్థినులు మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారన్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా ఉపాధ్యాయులు చక్కటి శిక్షణను ఇస్తున్నారన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ హయ్యర్ ఎడ్యుకేషన్ గంగాధర్, ఆంజనేయులు, స్పోర్ట్స్ ఆఫీసర్ రామ్‌లక్ష్మణ్, గణపతి, రమణయ్య, సైదులు, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles