పంట పొలాల్లో వ్యవసాయ అధికారులు


Sat,November 16, 2019 11:10 PM

-వరిసాగులో నూతన పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు
-జోగిపేట డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి అరుణ
అందోల్, నమస్తే తెలంగాణ: వరి సాగు పద్ధతిలో నూతన సాగు విధానాలను పాటించి అధిక దిగుబడులను పొందాలని జోగిపేట డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి అరుణ రైతులకు సూచించారు. శనివారం మండలంలో డాకుర్‌లో పత్తి, మిర్చి తదితర పంటలను పరిశీలించారు. అదేవిధంగా అందోల్ డివిజన్ పరిధిలోని అందోల్, పుల్కల్, హత్నూర మండలాల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతునేస్తం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తి పంటను ఉదయం 10గంటల తర్వాత తీయడం ద్వారా పంట నాణ్యత పెరుగుతుందని అన్నారు. యాసంగి మాసంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్న రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులను సాధించాలన్నారు. కార్యక్రమంలో అందోల్ మండల వ్యవసాయ అధికారి సారికారెడ్డి, ఏఈవోలు శ్రీకర్,తదితరులు పాల్గొన్నారు.
రాయికోడ్‌లో..
రాయికోడ్: మండల పరిధిలోని ఇటిక్యాపల్లిలో శనివారం వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులను కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి అవినాశ్‌వర్మ మాట్లాడుతూ రైతులతో ముఖముఖి నిర్వహించి నేరుగా పంటలను సందర్శించి పలు రకాల సూచనలు, సలహాలను ఇచ్చామన్నారు.
అలాగే పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు పంటలపై యాజమాన్య పద్ధతులు, ఎరువులు ఎంత మోతాదులో వాడాలో వివరించారు. కాగా, వాతావరణ ఆధారిత పత్తికి బీమా చెల్లించిన రైతులకు నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో రైతు కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles