మత్స్యకారుల సంక్షేమమే సర్కార్ ధ్యేయం


Sat,November 16, 2019 11:10 PM

-ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి
-నల్లవాగు ప్రాజెక్టులో 5.50లక్షల రొయ్య పిల్లల విడుదల
సిర్గాపూర్: టీఆర్‌ఎస్ సర్కారు మత్స్య పరిశ్రమాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లవాగు ప్రాజెక్టులో 5,50లక్షల రొయ్య పిల్లలలను మత్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా మత్స్య శాఖాధికారి సుజాతతో కలిసి ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుల వృత్తుల వారిని ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం వందశాతం రాయితీపై మత్స్యకారులకు చేప పిల్లలను సరఫరా చేసిందన్నారు. అయితే గత నెల మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నల్లవాగు సందర్శించి, రెండో విడుత చేప పిల్లల విడుదల కార్యక్రమంలో రొయ్య పిల్లల విత్తనాలను కూడా నల్లవాగు ప్రాజెక్టులో వదిలేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆయన మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగాలనే సదుద్దేశ్యంతో వారి జీవనోపాధికి అన్ని చెరువుల్లో కూడా చేప పిల్లల్ని వదులడం జరిగిందన్నారు. అయితే మత్స్య కార్మికులు మాత్రం దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. చేపలను నేరుగా మార్కెట్‌లో అమ్మి లబ్ధి పొందాలన్నారు. ఇదివరకు నల్లవాగు ప్రాజక్టులో మూడు రకాలైన చేప పిల్లలు రోహు 50శాతం, కట్ల 40శాతం, మృగాల 10శాతం మొత్తం 11లక్షల45వేల చేపలను వదలడం జరిగిందని మత్స్యశాఖ డీడీ లక్ష్మీనారాయణ, జిల్లా మత్స్యశాఖాధికారి సుజాత ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వెంకట్రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రాంసింగ్, ఎంపీపీ జార మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ మల్లగారి రాఘవరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రయాగబాయిమాధవరావు, మత్స్య సంఘం అధ్యక్షుడు సంగయ్య, ఎంపీటీసీ బేగరి ప్రేమల, సర్పంచ్ గంగామణి, రైతు సమన్వయ మండల కోఆర్డినేటర్ గుర్రపు కృష్ణమూర్తి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సంజీవరావు, మాధవరావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మత్స్యకార్మికులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...