మొక్కలతో కాలుష్యం మాయం


Sat,November 16, 2019 11:10 PM

-ఎంపీ సంతోశ్‌కుమార్ స్ఫూర్తితో గ్రీన్ చాలెంజ్
-మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి
సంగారెడ్డి మున్సిపాలిటీ: రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని మాయం చేయడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ఎంపీ సంతోశ్‌కుమార్ స్ఫూర్తితో గ్రీన్ చాలెంజ్‌ను తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి సూచించారు. శనివారం ప్రశాంత్‌నగర్ కాలనీ హౌసింగ్ బోర్డు నీటి సరఫరా ట్యాంక్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి ఇచ్చిన చాలెంజ్‌తో మొక్కలు నాటామన్నారు. పట్టణంలో పచ్చని వాతావరణం కనబర్చేందుకు అందరూ చాలెంజ్‌గా తీసుకుని మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షిస్తే అవి చెట్టుగా పెరిగి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి అందించి వాతావరణ కాలుష్యాన్ని దూరం చేస్తాయన్నారు. గ్రీన్ చాలెంజ్ ప్రారంభించి స్ఫూర్తిగా నిలిచిన ఎంపీ సంతోశ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన పిలుపుతో మొక్కలు నాటి మరో ముగ్గురు చేత మొక్కలు నాటించేందుకు వీహబ్ సీఈవో దీప్తి రావుల, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రవికిరణ్, మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్‌లను మొక్కలు నాటాలని కమిషనర్ ప్రశాంతి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఈ లక్ష్మీనారాయణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...