చెరువు కింద పంటలను కాపాడాలి


Sat,November 16, 2019 11:10 PM

-అధికారులకు ఎమ్మెల్యేల వినతి
-పంటలు వేసేందుకు సూచనలు చేయాలి
-జాయింట్ కలెక్టర్ నిఖిల
సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ: జిల్లాలో సరాసరి వర్షపాతం నమోదు కాకపోవడంతో చెరువుల కింద రైతులు వేసిన పంటలను కాపాడడానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మాణిక్‌రావులు అధికారులను కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నల్లవాగు ప్రాజెక్టుపై నీటి పారుదల సలహా బోర్డు సమీక్ష సమావేశం జేసీ నిఖిల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు తక్కువ ఉన్నందున చెరువుల కింద సాగు చేస్తున్న పంటలను కాపాడడానికి చర్యలు తీసుకుని రైతులకు నష్టం జరుగకుండా చూడాలన్నారు. నీటిపై ఆధార పడకుండా పంటలు వేసేందుకు రైతులకు అధికారులు సూచించాలన్నారు. సాగునీటికి ఇబ్బంది కలుగకుండా పంటలకు నీరు అందించే ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఎమ్మెల్యేలు కోరారు.

రైతులకు పంటలపై సూచనలు చేయాలి
వర్షపాతం తక్కువగా ఉన్నందున నీటి అవసరం లేని పంటల సాగుపై రైతులకు అధికారులు సూచనలు చేయాలని జేసీ నిఖిల అధికారులను ఆదేశించారు. నల్లవాగు ప్రాజెక్టుపై తీసుకోవాల్సిన చర్యలు చెరువుల అభివృద్ధి, పంటలను కాపాడడానికి చేపట్టిన చర్యలపై అధికారులు నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంటలకు నీరందించే ప్రాంతాల్లో నిల్వ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నల్లవాగు ప్రాజెక్టు కింద నీటి పారుదలకు ప్రతిపాదించిన 4,200 ఆయకట్టు ఎకరాల ఆధునీకరణ వ్యవస్థను మెరగు పర్చేందుకు రూ.24.145 కోట్లు మంజూరు చేశామన్నారు. పనులను పురోగతిలో ఉన్నాయని, యాసంగి సీజన్‌లో 755 ఎకరాలలో 500ల ఎకరాలకు పైగా ఆయకట్టు కలిగి ఉన్న మూడు మైనర్ ఇరిగేషన్ కోసం చెరువులను 2019-20లకు ప్రతిపాదనలు పంపామన్నారు. ముఖ్యంగా వర్షాలు లేకపోవడం చెరువులు నిండక పోవడంతో అందుబాటులో ఉన్న నీటి వనరుల ఆధారంగా పంటలు వేసిన రైతులు నష్ట పోకుండా చర్యలు తీసుకుంటామని జేసీ భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ డీఈ మధుసూదన్‌రెడ్డి, వ్యవసాయ అధికారి నర్సింహారావు, ఉద్యానవన శాఖ అధికారి సునీత, సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్ ఆర్డీవోలు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...