ఖబ్రస్తాన్ స్థలాన్ని పరిశీలించిన మైనార్టీ నాయకులు


Fri,November 15, 2019 11:24 PM

మునిపల్లి: గ్రామాల్లో మైనార్టీలకు కేటాయించిన ఖబ్రస్తాన్ స్థలంలో ఇతరులు ప్రవేశించేందుకు వీలులేదని మండల మైనార్టీ అధ్యక్షుడు కుత్బోద్దీన్ అన్నారు. శుక్రవారం మండలంలోని గార్లపల్లిలో మైనార్టీలకు 70సంవత్సరాల క్రితం కేటయించిన స్థలాన్ని మండల మైనార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గ్రామానికి చెందిన ఇతర కులస్థులు అక్రమంగా లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి గార్లపల్లిలో మైనార్టీలకు కేటాయించిన ఖబ్రస్తాన్ స్థలంలో ఇతరులకు తావు ఇవ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఖమ్రోద్దీన్, మైనార్టీ శాఖ ఉపాధ్యక్షుడు గరీబోద్దీన్‌తో పాటు మండల మైనార్టీలు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...