రైతునేస్తంతో సమస్యల పరిష్కారం


Fri,November 15, 2019 11:24 PM

వట్‌పల్లి: రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా రైతుల పంటల వివరాలు, సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఏఈవో సవిత తెలిపారు. శుక్రవారం మండలంలోని మంచిర్యాల తండాలో రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట పొలాల్లో రైతులతో మాట్లాడి వారు సాగుచేస్తున్న పంటల వివరాలను తెలుసుకుని ఆన్‌లైన్ చేయడం జరిగిందన్నారు. రైతులు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు పంటమార్పిడి విధానం పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయని సూచించారు. పంటల సాగుకే పరిమితం కాకుండా పశు సంపద పెంపుపై దృష్టి పెట్టాలన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles