న్యాల్కల్ : మండల పరిధిలోని రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. సంకష్ట హర చతుర్థిని పురస్కరించుకుని వేదపండితులు స్వామి వారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేదపండితులు మంత్రోచ్చారణాల స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు 2100 దీపాలను వెలిగించారు. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. కాగా అలయ ట్రస్టు ఆధ్యర్యం లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పా ట్లు చేశారు.
వరసిద్దివినాయక ఆలయంలో..
అలాగే మండల పరిధిలోని హద్నూర్లోని వరసిద్ధివినాయక, చీకూర్తి గ్రామంలోని సిద్ధి వినాయక ఆలయాల్లో కూడా సంకష్ట హర చతుర్థిని ఘనంగా నిర్వహించారు. పలువురు భక్తులు ఆయా ఆలయాల్లో అ న్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.