మాజీ ఎమ్మెల్సీకి మంత్రి హరీశ్‌రావు పరామర్శ


Fri,November 15, 2019 11:23 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో చికిత్సలు చేయించుకుని ఇటీవల ఇంటికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణను ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు పరామర్శించారు. శుక్రవారం అందోల్ నియోజకవర్గంలో కార్యక్రమాలకు వెళు తూ మార్గమధ్యలో మాజీ ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన నివాసాని కి మంత్రి వచ్చారు. పనులు ఎన్ని ఉన్నా ఆరోగ్యమే ముఖ్యమని ఆరోగ్యంగా ఉంటే పనులను ఎప్పుడైనా చేసుకోవచ్చని సూచించారు. వైద్యులు చెప్పిన విధంగా మందులు వాడి త్వరగా కోలుకోవాలన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కంది ఎంపీటీసీ నందకిషోర్, సినీ నిర్మాత శివకుమార్, నా యకులు డాక్టరు శ్రీహరి, జడ్సీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అమీనుద్దీన్, నర్సింహారెడ్డి, జిట్టె రవి, పాండు, గౌతమ్‌రెడ్డి, సూర్యకుమార్‌గౌడ్, నర్సింహులు తదితరులు ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...