మున్సిపల్‌లో రక్తదాన శిబిరం


Fri,November 15, 2019 11:23 PM

-రక్తదానం చేసిన అసిస్టెంట్ కలెక్టర్ జితేష్ వి పాటిల్
సంగారెడ్డి మున్సిపాలిటీ : రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్న వారిని కాపాడేందుకు ఉపయోగపడుతుందని అసిస్టెంట్ కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కలెక్టర్ పాల్గొని రక్తదానం చేశారు. అలాగే మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి పాటు మున్సిపల్ సిబ్బంది 30 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అసిట్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న యువకులు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకునే అవకాశం కలుగుతుందని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితుల ప్రాణాలు కాపాడే అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ శానిటేషన్ ఇన్స్‌పెక్టర్ విజయ్‌బాబు, ఏఈ లక్షినారాయణ, సిబ్బంది రాజు, మహెందర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...