నేటి నుంచి సైన్స్ ఫెయిర్


Thu,November 14, 2019 11:30 PM

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : పటాన్‌చెరు పట్టణం లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరుగబోతున్నది. విద్యా శా ఖ అధికారులు సైన్స్ ఫెయిర్ వివరాలను గురువారం వెల్లడించారు. పటాన్‌చెరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఈ నెల15 నుంచి 17వ తేదీ వరకు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన -2019ని నిర్వహిస్తున్నారు. సైన్స్, మాథ్స్‌తో పాటు ఇతర ప్రయోజిత అంశాలపై జిల్లాలోని పాఠశాలల విద్యార్థుల ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

ఎగ్జిబిషన్ ఏర్పాట్ల పరిశీలన..
గురువారం డీఈవో విజయలక్ష్మి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రదర్శనకు వస్తున్న విద్యార్థినులకు ప్రత్యేకమైన భద్రత, వసతిని కల్పించేందుకు ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా డీఈవో విలేకరులతో మాట్లాడుతూ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన సైన్స్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. సైన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రధానంగా సుస్థిర వ్యవసాయ పద్ధతులు, శుభ్రత, ఆరోగ్యం, వనరుల నిర్వహణ, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్తు రవాణా- సమాచార రంగం, విద్యా ఆటలు, గణిత మోడలింగ్ అనే అంశాలపై విద్యార్థులు మెడల్స్‌ను ప్రదర్శిస్తారని ఆమె వెల్లడించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు, బీఈడీ, డీఈడీ, ట్రైనీ టీచర్స్ బోధనోపకరణాలు కూడా ప్రదర్శించే అవకాశం కల్పించామన్నారు. పలు పాఠశాలలనుంచి వస్తున్న విద్యార్థులకు ప్రదర్శనలు చూసేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయు లు సహకరించాలని సూచించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...