రహేలా వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది


Thu,November 14, 2019 11:29 PM

కంది : కట్టుకున్న భర్త వదిలేయడంతో సంగారెడ్డి పట్టణానికి చెందిన రహేలా ఇద్దరు ఆడ పిల్లలతో రోడ్డున పడ్డారు. దీంతో బతుకుబండి నడిపేందుకు టైలరింగ్ వృత్తిని ఎంచుకున్నది. త న ఇద్దరు బిడ్డలను చదివిస్తూ జీవనం కొనసాగిస్తున్నది. ఇంతలలోనే విధి వక్రికరించింది. కొ ద్దిరోజల క్రితం రహేలా తన చిన్న కూతురు వరమ్మను రంజోల్‌లోని పాఠశాలలో ద్విచక్రవాహనంపై వదిలేసి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రహేలా తీవ్రగాయాలయ్యాయి.

ప్రమాదానికి గురై మంచాన పడ్డ తల్లికి అమ్మ, బిడ్డలే రోజూ సపర్యలు చేస్తున్నారు. కాగా తలకు బలమైన గాయాలు తగులడంతో ప్రస్తుతం ఆమె ఎవరినీ గుర్తు పట్టలేని స్థితికి చేరింది. రహేలా వైద్యం కోసం వైద్యులను సంప్రదిస్తే ఆపరేషన్‌కు రూ.ల క్ష వరకు ఖర్చు అవుతుందని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు రహేలాకు అయ్యే వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు రహేలా కుటుంబాన్ని పరామర్శించి ముందస్తు ఖర్చులో కోసం డబ్బులు ఇవ్వాలన్న మంత్రి ఆదేశాలతో గురువారం ఓడీఎఫ్‌లో రహేలా తండ్రికి కంది తహసీల్దార్ సరస్వతి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. మెరుగైన వైద్యం కోసం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు ఆమె తరలించి వైద్య చికిత్స అందజేస్తామని తహసీల్దార్ తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles