నేడు మంత్రి హరీశ్‌రావు పర్యటన


Thu,November 14, 2019 11:29 PM

అందోల్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం అందోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని అందోలు, పుల్కల్ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పుల్కల్ మండలం సింగూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అందోలు-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని అందోలులో సీసీ రోడ్లు, మురుగు కాలువలకు శంకుస్థాపన, 2:15 గంటలకు బురదవాగులో పైపులైన్, ఫీల్టర్ బెడ్ పనులకు శంకుస్థాపన, 2:30 గంటలకు జోగిపేటలోని క్లాక్ టవర్ మరమ్మతు పనులు, సీసీ రోడ్లు, మురగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన, 2:45 గంటలకు పోసానిపేట రోడ్డులో శ్మశాన వాటిక, డంప్‌యార్డులకు శంకుస్థాపన, మధ్యాహ్నం 3 గంటలకు జోగిపేట గ్రంథాలయ నూతన భవానికి శంకుస్థాపన, 3:15 గంటలకు సుభాష్ చంద్రబోస్ పార్కు అభివృద్ధి, సీసీ రోడ్లు, మురగు కాలువలకు శంకుస్థాపన, 3:30 గంటలకు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద జేసీబీ, పారిశుధ్య వాహనాలు ప్రారంభించనున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...