చిన్న పిల్లలను సన్మార్గంలో నడుపాలి


Thu,November 14, 2019 11:29 PM

సంగారెడ్డి చౌరస్తా: చిన్న పిల్లలు తెల్ల కాగితం లాంటి వారని జిల్లా సంయుక్త కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. చిన్నప్పుడే వారిని సన్మార్గంలో నడిపితే సమాజం బాగుంటుందని ఆకాంక్షించారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని గురువారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జేసీ నిఖల వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నెహ్రూకి బాలలంటే ఇష్టమని గుర్తు చేశారు. అయితే ఈ నెల 20న 191 దేశాలలో బాలల దినోత్సవం జరుపుకుంటున్నారని వివరించారు. తల్లిదండ్రులు పిల్లలను లింగబేధం లేకుండా చదివించాలన్నారు. బాలల రక్షణకు చట్టాలు ఉన్నాయని ఎవరు మర్చిపోవద్దని జేసీ హితవు చేశారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో ఉన్న అనాథ పిల్లలకు గురుకులాలలో 5వ తరగతిలో ప్రవేశానికి తగిన శిక్షణ ఇస్తే వారి భవిష్యత్‌కు భరోసా ఉంటుందన్నారు.

అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జేసీ సూచించారు. జిల్లాలో ఈ ఏడాది 33 బాల్య వివాహాలను నిరోధించడంతో పాటు ఆపరేషన్ ముస్కాన్ కింద 75 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తుల ను చేసినట్టు వివరించారు. ఆయా విద్యార్థులను పాఠశాలలో చేర్పించినట్టు వెల్లడించారు.
అనంతరం వివిధ వేషాధారణలతో హాజరైన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐసీడీఎస్ పీడీ పద్మావతీ, డీసీపీవో రత్నం, ఉప వైద్యాధికారి శశాంక్, తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...