రైతులకు న్యాయం చేయండి


Thu,November 14, 2019 11:29 PM

సంగారెడ్డి చౌరస్తా: రైతులు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం గిట్టు బాటు ధరకు కొనుగోలు చేస్తుందనే నమ్మకంతో రైతులు విక్రయ కేంద్రాలకు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఆత్మశుద్ధితో పనిచేయాలని, అపుడే వారికి న్యాయం జరుగుతుందని జేసీ నిఖిల పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో కొనుగోలు కేంద్రాల పనితీరుపై అధికారులతో జేసీ సమీక్షించారు.

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ క్లస్టర్ అధికారులు తమకు కేటాయించిన ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రతి రోజు సందర్శించి పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 35 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 37 కేంద్రాలు ఏర్పాటు చేస్తూ క్లస్టర్ అధికారులను నియమించామని చెప్పా రు. వారికి కేటాయించబడిన కేంద్రాలను సందర్శించి రైతులు తమ పంటను ఆరబెట్టుకునేందుకు అనువైన స్థలం, అవసరమైన గన్నీ బ్యాగులు, టార్ఫాలీన్‌లు ఉన్నాయా అని పరిశీలించుకోవాలన్నారు. తూకం కాంటాలను సరి చూసుకోవాలన్నారు.

ప్యాడీ క్లీనర్ యంత్రం రోజు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస మౌలిక వసతులు విధిగా ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోళ్ల ప్రారంభం నుంచి ముగిసే వరకు క్లస్టర్లదే బాధ్యత అని జేసీ స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద కనీస మద్దతు ధరను తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజువారి నివేదికతో పాటు క్యుములేషన్ నివేదికను కూడా ప్రత్యేక యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలని జేసీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా సహకార అధికారి ప్రసాద్, మర్కెటింగ్ సహాయ సంచాలకులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...