డాక్టర్లు, సిబ్బందికి రక్షణ కల్పించాలి


Wed,November 13, 2019 10:40 PM

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా కేంద్ర దవాఖానలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి రక్షణ కల్పించాలని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భీంరావ్ పాటిల్ కోరారు. బుధవారం యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్లు, సిబ్బందిపై దాడిని నిరసిస్తూ దవాఖాన ఎదుట తమకు రక్షణ కల్పించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం జిల్లా దవాఖానలో చికిత్స పొందుతూ మరణించిన దశరథ్ కుటుంబ సభ్యులు కారణం లేకుండా డాక్టర్లు, సిబ్బందిని కొట్టడం, దూషించడం సరికాదన్నారు. బాత్‌రూంలో పడి చనిపోతే డాక్టర్ల నిర్లక్ష్యం ఎలా అవుతుందన్నారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం డాక్టర్లు, సిబ్బంది ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్లు కిరణ్‌కుమార్, పరశురాంనాయక్, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...