విద్యార్థులను అభినందించిన మంజీరా స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు


Wed,November 13, 2019 10:40 PM

కొండాపూర్: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-19 బాలికల విభాగంలో యోగా పోటీలను కలకత్తాలో నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని గంగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పవిత్ర, నందీశ్వరీలు రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ సాధించి జాతీయస్థాయికి ఎంపికవడంతో బుధవారం మంజీరా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంజీరా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మాణయ్య మాట్లాడుతూ విద్యార్థుల సహాయ సహకారాలకు తమ క్లబ్ ఆధ్వర్యంలో కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రాజలీల, ఎంఈవో భీంసింగ్, క్లబ్ కార్యదర్శి విఠల్, ఉపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, వైద్యనాథ్, ప్రవీణ్‌కుమార్, రాఘవేంద్ర, విజయ్‌కుమార్, మాధవి, ప్రసాదిని, అనిత తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...