ఉల్లాసంగా.. ఉత్సాహంగా..


Wed,November 13, 2019 10:39 PM

కొండాపూర్: మండలంలోని గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో రెండో రోజు 6వ రాష్ట్రస్థాయి స్వేరోస్ ఒలింపిక్ క్రీడలు కొనసాగాయి.రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జోన్ల నుంచి 1600 మంది విద్యార్థులు క్రీడల్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 9 క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు.

రెండో రోజు క్రీడాపోటీల్లో వివరాలు..
ఖోఖోలో జోన్ 1, 4 జట్ల మధ్య హోరాహోరీ ఫైనల్ పోటీ జరిగింది. ఈ పోటీలో జోన్-1 విజయం సాధించగా, జోన్-4 రెండో స్థానం సరిపెట్టుకున్నది. టెన్నికాయిట్‌కు సంబంధించి అం డర్-17 విభాగంలో జోన్-4పై జోన్-3 విజయం సాధించింది. చెస్‌లో అండర్-17 విభాగంలో జోన్-1, అండర్-19లో జోన్-3, అండర్-14లో జోన్-1లు విజయం సాధించాయి. క్యారమ్స్ పోటీల్లో భాగంగా అండర్-14కు సంబంధించి జోన్-2 విజయం సాధించగా, అండర్-17 విభాగంలో అండర్-19లో జోన్-2 జట్లు విజయం సాధించాయి. వాలీబాల్ పోటీలకు సంబంధించి అండర్-17లో జోన్-2, అండర్-19లో జోన్-1 విజయ సంకేతాన్ని ఎగురవేశాయి. ఫుట్‌బాల్ పోటీల్లో అండర్-17-19లో జోన్-2 విజయం సాధించింది. హ్యాండ్‌బాల్‌లో అండర్-17 విభాగంలో జోన్-1, అండర్-19లో జోన్-2 గెలుపొందాయి. బాల్ బ్యాడ్మింటన్‌కు సంబంధించి అండర్-17 విభాగంలో జోన్-1, జోన్-4 విజయం సాధించాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles