ప్రేమించి మోసం చేసిన వ్యక్తికి కౌన్సెలింగ్ ఇవ్వాలి


Mon,November 11, 2019 10:53 PM

సంగారెడ్డి టౌన్ : ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన వ్యక్తికి కౌన్సెలింగ్ నిర్వహించాలని అందోల్ మండలానికి చెందిన ఓ ఫిర్యాదురాలు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేసింది. సోమవారం నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్‌కు పలు ఫిర్యాదులు అందాయి. అవి ఇలా ఉన్నాయి.
-తనను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనకు వేరే సంబంధాలు వస్తే వాటిని చెడగొట్టి గ్రామంలో అందరికి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ప్రస్తుతం పెళ్లి చేసుకోనని మోసం చేసిన వ్యక్తికి కౌన్సెలింగ్ నిర్వహించి తనకు న్యాయం చేయాలని అందోల్ మండలానికి చెందిన ఒక ఫిర్యాదురాలు ఎస్పీకి వినతిపత్రం అందజేసింది.
-తాను గత నెలలో సంగారెడ్డి మండలంలో ఒక ప్లాట్ కొనుగోలు చేశానని, ఆ స్థలంలో తాను కంచె నిర్మిస్తే వేరే వ్యక్తులు దానిని తొలిగించి జేసీబీతో తవ్వి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆ స్థలాన్ని అమ్మినవ్యక్తి నుంచి తన డబ్బులు ఇప్పించి తనకు న్యాయం చేయాలని సంగారెడ్డి మండలానికి చెందిన ఒక ఫిర్యాదుదారుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

-రోడ్డుపై తమ పక్కింటి వారు వాహనాలు నిలిపి తాము ఇంటిలోకి రావడానికి దారి లేకుండా చేస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని సంగారెడ్డి మండలానికి చెందిన ఓ ఫిర్యాదుదారుడు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...