ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి


Mon,November 11, 2019 10:53 PM

సంగారెడ్డి చౌరస్తా: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు తరలివచ్చి వారి ఫిర్యాదులను అర్జీల రూపంలో కలెక్టర్‌కు అందజేశారు. ఆయా అర్జీలను స్వీకరించిన కలెక్టర్ వాటిని వెంటనే పరిష్కరించాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఒకవేళ మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను పరిష్కార దిశగా మార్గాలు చూపాలన్నారు.గ్రీవెన్స్‌లో అంది న ఫిర్యాదుల్లో కొన్ని ఈవిధంగా ఉన్నాయి.
-మునిపల్లి మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన 37 మంది లబ్ధిదారులు తమ గొర్రెలకు మేత కోసం ప్రభుత్వ భూములు లేనందున సింగూరు ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో గొర్రెలకు మేత, తాగేందుకు నీరు అనుమతించాలని కోరారు.
-కంగ్టి గ్రామ పంచాయతీ నుంచి ముకుంద్ నాయక్ తండా కొత్తగా ఏర్పడిందని, అందులో వాచునాయక్ తండా హ్యాబిటేషన్ కూడా ఉన్నదని, అయితే ఇందుకు సంబంధించి నిధులు కంగ్టికి వెళ్తున్నాయని, ఆయా నిధులను ముకుంద్‌నాయక్ తండాకు ఇవ్వాల్సిందిగా సర్పంచ్ సురేఖ కోరారు.
-జహీరాబాద్‌కు చెందిన విట్టల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో రికార్డ్ కీపర్, రిజిస్ర్టేషన్ అసిస్టెంట్ పోస్టులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
-న్యాల్‌కల్ మండలం మామిడిగి హుమ్నాపూర్‌లో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులో తనను నియమించాలని జహీరాబాద్‌కు చెందిన మోహన్‌కుమార్ అభ్యర్థించారు.
-కంది మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బొమ్మల లక్ష్మయ్య తన అర్జీని ఇస్తూ గత 100 ఏండ్లుగా బుడగ జంగాల కోసం ఉన్న సర్వే నంబర్ 484లోని శ్మశానవాటికలో తన తమ్ముడి మృతదేహాన్ని ఖననం చేయనీయకుండా అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
-జిన్నారం మండలం జంగంపేట గ్రామస్తులు అర్జీని అందజేస్తూ తమ కాలనీకి ఆనుకొని శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు నిర్మిస్తున్నారని, వాటిని అనువైన స్థలం ఉన్నందున అక్కడికి మార్చాలని కోరారు.
-అందోల్-జోగిపేటలో 2,4 వార్డులలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నందున తగు చర్యలు తీసుకోవాలని పిట్ల కృష్ణ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేసీ నిఖిల, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...