జడ్పీ స్థాయీసంఘంలో వ్యవసాయంపై సమీక్ష


Mon,November 11, 2019 10:52 PM

సంగారెడ్డిటౌన్ : జిల్లా పరిషత్ స్థాయీసంఘం-3వ సమావేశంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. సోమవారం జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ కె.ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయం, పశుపోషణ, పాడి పరిశ్రమ అభివృద్ధి, భూగర్భ , చక్కెర, పౌరసరఫరాలు, హర్టీకల్చర్, పట్టు పరిశ్రమ, మత్య్సశాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా సమావేశానికి హాజరుకాని అధికారులపై కలెక్టర్‌కు లేఖ రాయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి జహీరాబాద్ జడ్పీటీసీ నాగిశెట్టి, జడ్పీ కో -ఆప్షన్ సభ్యుడు ముస్తఫా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles