సిర్గాపూర్ : రాష్ట్రంలో గ్రూప్-2లో ర్యాంకు సాధించి ఉప తహసీల్దార్‌గా నియామకమైన మనోహర్‌రావును జిల్లా కలెక్టర్ హనుమంతరావు సోమవారం సన్మానించారు. మండలంలోని ఉజలంపాడ్ గ్రామానికి చెందిన మనోహర్‌రావు తెలంగాణ గ్రూప్-2 పరీక్షల్లో స్టేట్ 3వ ర్యాంకు సాధించిన విషయం విదితమే. అయితే మారుమూల ప్రాంతం నుంచి గ్రూప్-2లో విజయం సాధించి డిప్యూటీ తహసీల్దార్‌గా నియామకమైన తనను కలెక్టర్ కార్యాలయానికి తల్లిదండ్రులతో పాటు రావాలని ఆహ్వానించడంతో మనోహర్‌రావు సోమవారం కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో మనోహర్‌రావుతో పాటు వారి తల్లిదండ్రులు కమలాబాయి,పండరీనాథ్రావును కలెక్టర్ సన్మానించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించి గొప్ప ప్రయోజకుల్ని చేయాలనే తపన ప్రతి తల్లిదండ్రుల్లో ఉండాలని తెలిపారు.అదే విధంగా తన సోదరుడు టీఎస్ పీఎస్సీలో జిల్లా టాపర్‌గా విజయం సాధించి నారాయణఖేడ్ ఏఈవోగా పని చేస్తున్న రాందాస్(వ్యవసాయ విస్తరణాధికారి)ను కలెక్టర్ అభినందించారని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్రావు, సీసీ చరణ్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.