మెదక్, నమస్తే తెలంగాణ : ఏసయ్య నామ సంకీర్తనలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కోత కాలపు పండుగ (సంవత్సరాంత కృతజ్ఞత పండుగ)ను పురస్కరించుకుని భక్తులు తాము పండించిన తొలి పంటలోని దశమ భాగాన్ని ఏసయ్యకు సమర్పించుకున్నారు. ప్రత్యేక ఆరాధన దైవంతో కూడిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసయ్య నామస్మరణలతో చర్చి మర్మోగింది. రైతులు పండించిన పంటల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు తదితర వాటిని ఏసయ్యకు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చర్చిని మామిడి, అరటి, కొబ్బరి మట్టలతో అందంగా అలంకరించారు.ఈ సందర్భంగా సండే స్కూల్‌కు విద్యార్థినులు పాడిన ఏసయ్య భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి ప్రేమ్ సుకుమార్, పాస్ట ర్లు రాజశేకర్, విజయ్‌కుమార్, దయానంద్, సీఎస్ఐ కమిటీ సభ్యులు రోలండ్పాల్, గెలెన్ చిత్తరంజన్‌దాస్, శాంతికుమార్, సునీల్, జయరా జ్, జాయ్‌ముర్రే, శాంతికుమార్, సాలోమాన్‌రాజ్, కొమ్ము రాజు, సువన్ డగ్లస్, ఉదయ్‌కిరణ్ తదితరులు, భక్తులు పాల్గొన్నారు.