ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డికి సన్మానం


Sun,November 10, 2019 11:36 PM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ : ఆదివారం నారాయణఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డిని టీఆర్‌ఎస్ నాయకులు సన్మానించారు. పట్టణంలోని మా ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అత్యవసర పని మీద ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లారు. ఇదిలా ఉండగా రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్సీని సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీబాయి, ఏఎంసీ వైస్‌చైర్మన్ ఎం.ఏ.బాసిత్, మాజీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్, జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్‌నాయక్, మనూరు మాజీ ఎంపీపీ మోహన్‌రావు, కంగ్టి మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సంతోశ్‌పాటిల్, నాయకులు వెంకటేశం ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...