అభివృద్ధి బాటలో మున్సిపాలిటీలు


Sat,November 9, 2019 11:18 PM

-ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..
-ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
-తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో రూ.3.37 కోట్లతో అభివృద్ధి పనులు
-వెలిమెల, తెల్లాపూర్, విద్యుత్‌నగర్‌లో ఓపెన్ జిమ్‌లు ప్రారంభం

రామచంద్రాపురం : మున్సిపాలిటీలను అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్, విద్యుత్‌నగర్, ఉస్మాన్‌నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామాల్లో రూ.3.37కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సుమారు రూ.20లక్షలు సొంత ఖర్చుతో ఉస్మాన్‌నగర్‌లో అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు. ప్రజలకు కావాల్సిన అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఇలా ప్రతి గ్రామంలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆయా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, ఓపెన్ జిమ్, ప్రహరీ, శ్మశానవాటిక అభివృద్ధి పనులను రూ.3.37కోట్లతో చేసుకోవడం జరుగుతుందన్నారు. కొల్లూర్‌లో ఐదెకరాలను డంపింగ్ యార్డుకు కేటాయించడం జరిగిందని, దాని చుట్టూ ప్రహరీని నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీపడడం లేదన్నారు. కోట్లాది రూపాయాలను ప్రభుత్వం అభివృద్ధి పనులకు కేటాయిస్తుందన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, బల్దియా డివిజన్‌లతో పాటు గ్రామపంచాయతీల్లో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో నియోజకవర్గ ప్రజలు ముందు వరుసలో ఉన్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్, ఆహారభద్రత తదితర సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నామన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం హయాంలో జరుగనంతగా అభివృద్ధి టీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో జరుగుతుందని, అందుకే ప్రజలందరూ టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్నారని తెలిపారు. మినీ ఇండియా లాంటి ఈ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ రాములుగౌడ్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, మాజీ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సోమిరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ నర్సింహ, ఉస్మాన్‌నగర్ గ్రామాధ్యక్షుడు వెంకటేశ్‌యాదవ్, ఉమేశ్, శ్రీశైలం యాదవ్, దేవేందర్ యాదవ్, బాలయ్య, దేవేంద్రాచారి, వెంకట్రాంరెడ్డి, యాదయ్య, సాగర్, చెన్నారెడ్డి, బాబ్జీ పాల్గొన్నారు.

వ్యాయామం చేసి రిలాక్స్ అయ్యి..
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల, తెల్లాపూర్, విద్యుత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఒక్కో జిమ్‌ను రూ.13లక్షలతో ఏర్పాటు చేశారు. ఓపెన్ జిమ్‌ల ప్రారంభోత్సవం సందర్భంగా జిమ్‌లో ఏర్పాటు చేసిన పరికాలను పరిశీలించడంతో పాటు అక్కడే కొద్దిసేపు జిమ్ చేసి రిలాక్స్ అయ్యారు. ఓపెన్ జిమ్‌లను అందరూ సద్వినియోగం చేసుకుని ఫిట్‌నెన్స్‌ను పెంచుకోవాలని సూచించారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయించామని, మున్ముందు అన్ని గ్రామాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...