ఆక్సాన్‌పల్లి పాఠశాలకు వీవీ నియామకం


Sat,November 9, 2019 11:14 PM

అందోల్, నమస్తే తెలంగాణ: మండల పరిధిలోని అక్సాన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదీరాబాద్ రమేశ్ అన్నారు. శనివారం పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించి, సమస్యలపై ఆరా తీశారు. పాఠశాలలో సోషల్ సబ్జెక్టుకు సంబంధించిన పోస్టు ఖాళీగా ఉన్నదని నాలుగు రోజుల క్రితం ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి, జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి దృష్టికి రమేశ్ సమస్యను తీసుకువచ్చారు. దీంతో డీఈవో స్పందించి ఆక్సాన్‌పల్లి పాఠశాలకు వెంటనే సోషల్ సబ్జెక్టు సంబంధించిన విద్యావలంటీరును నియమించాలని అందోలు ఎంఈవో కృష్ణను ఆదేశించారు. డీఈవో ఆదేశాల మేరకు ఆక్సాన్‌పల్లి పాఠశాలకు విద్యావలంటీరుగా ఎం.అరుణను నియమించడంతో, శనివారం ఆమె విధుల్లో చేరారు. జడ్పీటీసీ రమేశ్ చొరవతో పాఠశాలలో సోషల్ సబ్జెక్టు టీచర్ సమస్య తీరిందని ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యపై స్పందించి పరిష్కరించిన డీఈవో విజయలక్ష్మికి రమేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...