యువత స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వాలి


Sat,November 9, 2019 11:14 PM

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: స్వయం ఉపాధికే యువత అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్‌లోని జవహార్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ కవిత దర్యానిరావు అన్నారు. శనివారం గీతం స్కూల్ ఆర్కిటెక్చర్, పలు సంస్థలు కలిసి గీతం హైదరాబాద్ క్యాంపస్‌లో ఒకరోజు సమాలోకనమ్ పేరున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కవిత దర్యానిరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పుడు మీరు నెర్చుకుంటున్న విద్యకు, వాస్తవ పని ప్రదేశంలో చేయాల్సిన పనికీ చాలా వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. తగిన నైపుణ్యాలు పెంపుదలపై దృష్టి పట్టడం వల్ల మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఆర్కిటెక్చర్ విద్యాసంస్థగా తాము జీవన, వృత్తిపర నైపుణ్యాల పెంపుదలపై దృష్టి పట్టడం ద్వారా తమ విద్యార్థులు మంచి వృత్తి నిపుణులుగా ఎదుగలుగుతున్నారన్నారు.

ఈ మధ్య తమ వర్సిటీలో జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో చాలా మంది తమ విద్యార్థులు యానిమేషన్, డిజైనింగ్, భవన నిర్మాణం వంటి స్వయం ఉపాధి రంగాల్లో స్థిరపడిన విషయాన్ని గుర్తించామన్నారు. గీతంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందినీయమన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ తన స్వాగతోపన్యాసంలో ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో సంచాలకుడు ప్రొఫెసర్ శ్రీరామ్, హెచ్‌ఎం టీవీ ఉపాధ్యక్షుడు ముత్తుకుమార్, గీతం ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ విభాగం డైరెక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్, పీఆర్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...