తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి


Sat,November 9, 2019 11:13 PM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి ఎదుగుదలకు కృషి చేయాలని మానసిక వ్యక్తిత్వ నిపుణుడు డాక్టర్ వీరేంద్ర అన్నారు. శనివారం నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్‌ఐటీ కళాశాలలో తల్లిదండ్రులతో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వీరేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను పాతతరంతో పోల్చవద్దని, అంతేకాకుండా ఇతరులతో పోల్చవద్దని తెలిపారు. చదువులో ప్రోత్సహించడంతో పాటు భవిష్యత్ కోసం సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. చదువుతో పాటు వారిలో నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రోగ్రాం కన్వీనర్ లక్ష్మీనర్సయ్య, ఏవోలు బాపిరాజు, అశోక్‌రెడ్డితో పాటు విద్యార్థులు ఉన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...