4కిలోల గంజాయి స్వాధీనం


Sat,November 9, 2019 11:13 PM

వట్‌పల్లి: నమ్మదగిన సమాచారం మేరకు నాలుగు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించిన ఘటన గౌతాపూర్‌లో జరిగింది. ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గౌతాపూర్‌లో గంజాయిని ఇంట్లో నిల్వ చేశారనే సమాచారంతో జోగిపేట సీఐ శ్రీనివాస్, సిబ్బందితో శుక్రవారం రాత్రి గ్రామంలోని మక్బూల్ ఇంట్లో సోదాలు చేయడం జరిగిందన్నారు. తమ సోదాల్లో మక్బూల్ ఇంట్లో ప్లాస్టిక్ సంచిల్లో 4కిలోల ఎండు గంజాయి లభించిందన్నారు. దీంతో గంజాయితో పాటూ మక్బూల్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...