జానకంపేట టీఆర్‌ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక


Fri,November 8, 2019 11:01 PM

అమీన్‌పూర్: మండలంలోని జానకంపేటలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఈర్ల రాజుముదిరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ఎం.భిక్షపతి, ఉపాధ్యక్షులుగా డి.యాదయ్య, ఎన్.కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కె.కృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజు ముదిరాజ్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పాండు యాదవ్, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఖాజిపల్లి రమేశ్ ముదిరాజ్, కొట్మల రమేశ్, కె.యాదగిరి ముదిరాజ్, కొట్మల కుమార్ యాదవ్, కె. నర్సింహాముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...