15 నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్


Fri,November 8, 2019 11:00 PM

సంగారెడ్డి చౌరస్తా: జిల్లా స్థాయి జవహర్ లాల్ నెహ్రూ సైన్స్, గణిత పర్యావరణ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పటాన్‌చెరులోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. విజ్ఞానశాస్త్ర, సాంకేతికత ద్వారా సుస్థిర అభివృద్ధి ప్రధాన అంశంగా సుస్థిర వ్యవసాయ పద్ధతులు, శుభ్రత ఆరోగ్యం, వనరుల నిర్వహణ, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్ రవాణా, సమాచార రంగం, విద్య-ఆటలు, గణిత మోడలింగ్ అనే ఉప అంశాలపై ప్రతి పాఠశాల నుంచి ఏదేనీ ఒక ఉప అంశంలో గరిష్టంగా 6, కనిష్ఠంగా ఒక ఎగ్జిబిట్‌ను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించామన్నారు. విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు, బీఈడీ, డీఈడీ, ట్రైనీ టీచర్లు, బోధన ఉపకరణాలను కూడా ప్రదర్శించవచ్చన్నారు. అయితే రెడ్‌మేడ్ ప్రదర్శనలు, థర్మాకోల్ అనుమతించబడవని స్పష్టం చేశారు. ఒక ఉప అంశం నుంచి ఒక ప్రదర్శన మాత్రమే ఉండాలన్నారు. ప్రదర్శన వెంట ఒక విద్యార్థి, ఒక పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అయితే ప్రదర్శనతో పాటు రైటప్, విద్యార్థి రెండు ఫొటోలు తీసుకురావాలని డీఈవో వివరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు ఈ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...