కొనసాగుతున్న జడ్పీ స్థాయీ సంఘం సమావేశాలు


Fri,November 8, 2019 11:00 PM

సంగారెడ్డి టౌన్ : జడ్పీ స్థాయీసంఘం సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు 7వ స్థాయీసంఘం (పనులు), మధ్యాహ్నం 2 గంటలకు 1వ స్థాయీసంఘం (ఆర్థిక మరియు ప్రణాళిక)పై సమీక్షా సమావేశం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మంజుశ్రీ అధ్యక్షతన నిర్వహించారు. ఉదయం సమావేశంలో రహదారులు, భవనాలు, నీటి పారుదల, విద్యుత్, పంచాయతీరాజ్, జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం, రవాణాశాఖలపై అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశానికి నాగిల్‌గిద్ద జడ్పీటీసీ రాజు రాథోడ్, అమీన్‌పూర్ జడ్పీటీసీ జి.సుధాకర్‌గౌడ్, కల్హేర్ జడ్పీటీసీ జి.నర్సింహారెడ్డి, రాయికోడ్ జడ్పీటీసీ పి.మల్లికార్జున్ పాటిల్ పాల్గొన్నారు. మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఆర్థిక, ప్రణాళికపై సమీక్షించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, అందోల్ జడ్పీటీసీ కె.రమేశ్, హత్నూర జడ్పీటీసీ పి.ఆంజనేయులు, మునిపల్లి జడ్పీటీసీ మీనాక్షి పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...