కార్యసాధనలో దిగితే విజయం మీ సొంతం


Fri,November 8, 2019 12:02 AM

సంగారెడ్డి చౌరస్తా : యువత తలచుకుంటే సాధించలేనిది ఏమి లేదని, కార్యసాధనలో దిగితే అన్నింటా విజయం సాధిస్తారని జిల్లా కలెక్టర్ ఎం.హనమంతరావు అన్నారు. గురువారం ఒక ప్రకటన జారీ చేస్తూ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11న మధ్యాహ్నాం 2.30 గంటలకు కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో యువతకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇటీవల నిర్వహించిన పల్లె ప్రగతిలో యువత భాగస్వామ్యం అయినందుకు కలెక్టర్ అభినందించారు. వారి సేవలను జిల్లా యంత్రాంగం మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు యువజన సంఘాల సభ్యులతో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గ్రామాభివృద్ధిలో యువత భాగస్వామ్యంపై వారిలో అవగాహన పెంపొందిస్తామని తెలిపారు. తిరిగి వారు గ్రామ ప్రజలను చైతన్యం చేయడంతో పాటు అంకితభావంతో గ్రామాభివృద్ధికి పాటుపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని యువజన సంఘాల సభ్యులు ఈ సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...