ఆకట్టుకున్న విపణి


Fri,November 8, 2019 12:02 AM

సంగారెడ్డి చౌరస్తా : చదువులే కాదు వంటలు, చేతి క ళల్లోనూ రాణిస్తామని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు నిరూపించారు. తమకు ఇష్టమైన వంటకాలను కొందరు విద్యార్థినులు వండి వేడి వేడిగా వడ్డిస్తే, మరికొందరు మెహందీ, పానీపూరి, హస్తకళ బ్యాగులు ఇలా ప్రదర్శన చేపట్టారు. గురువారం కళాశాల ఆవరణలో విపణి కమిటీ, ఎన్‌క్యూఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విపణి కార్యక్రమం అందరినీ ఆకట్టుకున్నది. విద్యార్థులు దాదాపు 30కి పైగా స్టాళ్ల ను ఏర్పాటు చేసి వారి వస్తువులను ప్రదర్శనకు ఉం చారు. నామ మాత్రపు ధరలకు అమ్మకాలకు ఉం చగా, అందులో కొన్నింటికి భలే గిరాకీ లభించింది. చికెన్ బిర్యానీ, జొన్నరొట్టెలు, పానీపూరీ, సాంప్రదాయ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అనంతరం కళాశాల విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనిత మాట్లాడుతూ ప్రతి ఏడాది తమ కళాశాలలో విపణి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. అయితే విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించేందుకు విపణి ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వీరపాపమాంబ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...