గీతమ్‌ను సందర్శించిన అమెరికా బృందం


Fri,November 8, 2019 12:02 AM

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణాన్ని అమెరికా (కాలిఫోర్నియా)లోని శాన్‌డియాగోకు చెందిన నేషనల్ యూనివర్సిటీ బృందం గు రువారం సందర్శించింది. నేషనల్ వర్సిటీ ఉపాధ్యక్షుడు బ్రాండన్ జౌగనాటోస్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం గీతమ్ ఉన్నతాధికారులతో విద్యా సంబంధాలు నెలకొల్ప డం, విద్యార్థులు- అధ్యాపకుల పరస్పర మార్పిడీ, సంయుక్త పరిశోధనలపై చర్చించారు. సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, మేనేజ్‌మెంట్, సైకాలజీ వంటి రంగాలలో పరస్పర సహాయ సహకారాలు అందించుకోవాలనే అవగాహనకు వచ్చారు. ఈ మేరకు త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. బ్రాండన్ నేషన్ విశ్వవిధ్యాలయం గురించి, చట్టబద్ద సంస్థల గుర్తింపు, విద్యారంగంలో వారికున్న అనుభవం, నిర్వహిస్తున్న కోర్సులు, విద్యార్థుల కేరిర్, వారికున్న ఉపాధి అవకాశాలు వంటివాటి గురించి వివరించారు.

నేషనల్ వర్సిటీలోని మౌలిక సదుపాయాలు, విద్యార్థులు, అధ్యాపకుల అభిప్రాయాలతో కూడిన వీడియోను ప్రదర్శించారు. గీతమ్ అధికారులు లేవనెత్తిన పలు సందేహాలను వారు నివృత్తి చేశారు. గీతమ్ గురించి సంక్షిప్తంగా తెలుసుకున్నారు. ముఖాముఖి అనంతరం అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో గీతమ్ హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్, గీతమ్ పాలకమండలి సభ్యుడు డాక్టర్ గంటా సుబ్బారావు, చీఫ్ ఇన్నోవేషన్ అధికారి క్రిష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం నుంచి పాల్గొనగా, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, జీమెచ్‌బీఎస్ డీన్ అండ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై లక్ష్మణ్‌కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ సీతారమయ్య, జీఎస్‌హెచ్‌ఎస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వై ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...