డీఎన్‌బీ శిక్షణ అనుమతి కోసం పరిశీలన


Fri,November 8, 2019 12:01 AM

సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లా దవాఖాలో జనరల్ సర్జరీ కోర్సు శిక్షణ అందించేందుకు దవాఖానలో అనువైన సౌకార్యాలు ఉన్నాయా.. కోర్సును నిర్వహణకు అన్ని విధాలుగా సరైనది గా ఉందా అనేదానిపై డీఎన్‌బీ (డిప్లోమాట్ నేషనల్ బోర్డు సభ్యుడు, కెన్ దవాఖాన ప్రొఫెస ర్ ఆర్‌ఆర్ సటోస్కర్ గురువారం జిల్లా కేంద్రం దవాఖానను సందర్శించారు. జనరల్ సర్జరీ కోర్సు శిక్షణ అనుమతి కోసం ముందస్తుగా సదుపాయాలు ఉన్నాయా.. లేదా అని దవాఖాలోని వివిధ విభాగాలను పరిశీలించారు. దవాఖానలో సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సదుపాయాలు అన్ని విధాలుగా అనుగుణంగా ఉంటే జనరల్ సర్జరీ కోర్సు నిర్వహించేందుకు జిల్లా దవాఖానకు అనుమతి లభిస్తుంది. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి, డాక్టర్లు కిరణ్‌కుమార్, భాగ్యశేఖర్‌గౌడ్, యాదగిరి, మధుకర్, బాలుమహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...