జిల్లాలో ఆరుగురు ఎస్‌ఐల బదిలీ


Wed,November 6, 2019 11:15 PM

సంగారెడ్డి టౌన్ : జిల్లాలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న ఆరుగురు ఎస్‌ఐలు బదిలీ అయినట్లు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న బి.దశరథ్ వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు, కొండాపూర్ పీఎస్‌లో పనిచేస్తున్న పి.ప్రసాద్‌ను వీఆర్ సంగారెడ్డికి, వీఆర్ సంగారెడ్డిలో పనిచేస్తున్న బి.సుభాష్‌రెడ్డి సంగారెడ్డి ట్రాఫిక్ పీఎస్‌కు, వీఆర్ సంగారెడ్డిలో పనిచేస్తున్న ఎండి.కుర్షిద్ అలీ సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ-2గా, వీఆర్ సంగారెడ్డిలో పనిచేస్తున్న అబ్దుల్ రఫీక్‌ను కంగ్టి పీఎస్‌కు, కంగ్టి పీఎస్‌లో పనిచేస్తున్న జి.నరేశ్‌ను కామారెడ్డి జిల్లా వీఆర్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీ అయిన ఎస్‌ఐలు ఉత్తర్వులు విడుదలైన వెంటనే వారికి కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...