క్యాన్సర్ బాధిత బాలుడికి ఆర్థిక సాయం


Wed,November 6, 2019 11:14 PM

సంగారెడ్డి టౌన్ : క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి రూ.20,500లు ఆర్థిక సాయం అందజేశారు. బుధవారం కంది మం డలం కవలంపేటకు చెందిన తలారి రాజు కుమారుడు శశాంక్ వైద్య పరీక్షల కోసం గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్ టెన్త్ బ్యాచ్ సొసైటీ సభ్యుడు కజ్జం రమేశ్ పుట్టినరోజు సందర్భంగా సొసైటీ సభ్యులు రూ.20,500 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు వెంకట్‌రావు మాట్లాడుతూ టెన్త్ బ్యాచ్ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యుల పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు చంద్రశేఖర్, రఘునాథ్, వంశీ, బద్దం శ్రీనివాస్, టి.శ్రీనివాస్, జి.ప్రసాద్, ఎస్.కిషన్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...