ప్రతి గింజనూ కొంటాం


Wed,November 6, 2019 11:14 PM

-ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరురూరల్ : రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చే స్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలంలోని లక్డారంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. నాణ్యమైన సరుకును తీసుకొచ్చి.. మంచి ధరను పొందాలని రైతులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాల్లో పంటను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యంలో మట్టిపెళ్లలు, రాళ్లు లేకుండా చూసుకోవాలని, నాణ్యమైన సరుకుని తీసుకురావడం ద్వారా కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం ఉండదని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని, అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వరి ధాన్యానికి గ్రేడ్ ఏ రకానికి రూ.1835, సాధారణ రకం ధాన్యానికి రూ.1815 చెల్లిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి అధికారి నరేష్ చక్రవర్తి, మండల వ్యవసాయాధికారి ఉషా, టీఆర్‌ఎస్ నాయకులు బొర్రా వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...