చిట్కుల్‌లో చెలరేగిన భూవివాదం


Wed,November 6, 2019 11:14 PM

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : చిట్కుల్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల వద్ద స్థల వివాదం చెలరేగింది. తమపై దాడి చేశారని పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రయివేటు పాఠశాల యజమాన్యంపై ఒక కేసు, జాతీయ రహధారిపై నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులతో కలసి ధ ర్నా చేశారని ఆందోళనకారులపై మరో కేసును పటాన్‌చెరు పోలీసులు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల స్థలానికి ఆనుకుని ఉన్న స్థలంలో ప్రైవేటు పాఠశాల యజమాన్యం రేకులను వేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం రాత్రి విద్యార్థినులు ఆ రేకులను ప్రిన్సిపాల్, గురుకుల ప్రిన్సిపాల్‌తో కలిసి తొలిగించే ప్రయత్నం చేశారు.

రేకుల తొలగింపును పక్కన ఉన్న బ్యూలా ప్రైవేటు పాఠశాల యజమాన్యం అడ్డుకుంది. కోర్టు వివాదం లో ఉన్న స్థలంలోని విద్యార్థులతో ఎలా ప్రవేశిస్తారని వారు గొడవకు దిగారు. బుధవారం గురుకుల పాఠశాల విద్యార్థినులతో కలిసి గురుకుల సిబ్బంది, పేరెంట్ కమిటీ, పలు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఇస్నాపూర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. గురుకుల స్థలంలో ప్రైవేటు వ్యక్తుల కబ్జాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకుల స్థలంలో ప్రైవేటు పాఠశాలను పెట్టడంతో పాటు అక్కడ ప్రార్థనాలయాన్ని పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ధర్నాలో ఆరోపించారు. ఆందోళనకారులు ధర్నా విరమించకపోవడంతో చూ స్తుండగానే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. అక్కడికి చేరుకున్న పటాన్‌చెరు సీఐ నరేశ్ ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి వద్ద ధర్నాకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళనను విరమించుకున్నారు.

రెండు కేసులు నమోదు..
గురుకుల పాఠశాల వద్ద స్థలం ఆక్రమించుకుంటున్నారని తెలిసి వెళ్లి అడిగినందుకు తనపై బ్యూలా స్కూల్ యజమానురాలు దాడి చేసిందని ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనకు విరుద్ధంగా జాతీయ రహదారిపై ధర్నా చేసినందుకు ధర్నాకు పాల్పడిన వ్యక్తులపై పటాన్‌చెరు పోలీసులు ట్రాఫిక్ విభాగం ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశా రు. ధర్నాలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ నరేశ్ తెలిపారు. ఈ మేరకు బ్యూలా యజమా ని లక్ష్మీరాజ్యం విలేకరులతో మాట్లాడు తూ కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలంలో గు రుకుల ప్రిన్సిపాల్ విద్యార్థులతో కలిసి వచ్చి రేకులను కూల్చివేశారని ఆరోపించారు. ఎస్పీకి ఆయన కార్యాలయంలో జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశామని తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...